Thu Feb 12 2026 20:48:07 GMT+0530 (India Standard Time)
అందుకే కేటీఆర్ రావడం లేదు..!
విద్యార్థులకు అన్యాయం చేసిన వారు బాగుపడరని, రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శాపం పెట్టారు. గ్లోబరినా సంస్థతో తనకు సంబంధం లేదని జూబ్లీహిల్స్ [more]
విద్యార్థులకు అన్యాయం చేసిన వారు బాగుపడరని, రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శాపం పెట్టారు. గ్లోబరినా సంస్థతో తనకు సంబంధం లేదని జూబ్లీహిల్స్ [more]

విద్యార్థులకు అన్యాయం చేసిన వారు బాగుపడరని, రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శాపం పెట్టారు. గ్లోబరినా సంస్థతో తనకు సంబంధం లేదని జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రమాణం చేయాలని నిన్న ఆయన కేటీఆర్ కు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఉదయాన్నే వీహెచ్ పెద్దమ్మగుడికి చేరుకొని కేటీఆర్ కోసం ఎదురుచూశారు. ఐదేళ్లు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థ తెలియదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ సన్నిహితులదని, అందుకే ఆయన ఒట్టు వేయడానికి పెద్దమ్మ గుడికి రాలేదని ఆరోపించారు.
Next Story