Wed Jan 21 2026 05:14:38 GMT+0000 (Coordinated Universal Time)
ఈటలపై విచారణతో పాటు.. మిగిలిన వారిపై కూడా?
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈటల రాజేందర్ పై విచారణ చేయడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కరోనా పై కేసీఆర్ తొలుత దృష్టి పెట్టాలని [more]
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈటల రాజేందర్ పై విచారణ చేయడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కరోనా పై కేసీఆర్ తొలుత దృష్టి పెట్టాలని [more]

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈటల రాజేందర్ పై విచారణ చేయడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కరోనా పై కేసీఆర్ తొలుత దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఆరోపణలు వచ్చిన వెంటనే ఈటల రాజేందర్ పై విచారణకు ఆదేశించిన కేసీఆర్ అన్ని పార్టీల్లో నేతల భూకబ్జాలపై విచారణ చేయాలని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఈటల రాజేందర్ పై విచారణకు ఆదేశించారని వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు.
Next Story