Sun Mar 08 2026 05:50:33 GMT+0530 (India Standard Time)
ఆమరణ దీక్షకు దిగిన వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ దీక్షకు దిగారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో [more]
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ దీక్షకు దిగారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో [more]

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ దీక్షకు దిగారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే దానిని ప్రభుత్వం 13వ తేదీన కూల్చివేసిందని వి.హనుమంతరావు తెలిపారు. తాను అమలాపురం నుంచి ఐదు లక్షలు వెచ్చించి అంబేద్కర్ విగ్రహాన్ని తెప్పించానన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్ లో పెట్టేంతవరకూ తాను దీక్షను కొనసాగిస్తానని వి.హనుమంతరావు తెలిపారు.
Next Story