Fri Mar 27 2026 03:01:47 GMT+0530 (India Standard Time)
ఓటమిపై ఉత్తమ్ స్పందన ఇదే....!!!

ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం కలుగుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఓటమి పాలవుతారని టీఆర్ఎస్ నేతలకు ముందే ఎలా తెలిసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్ల ద్వారా ఓట్ల లెక్కింపును జరపాలని కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నిలక అధికారులను కోరాలని ఆయన కోరారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. వీవీ ప్యాట్ ల ద్వారా ఓట్ల లెక్కింపు జరిపేలా కాంగ్రెస్ అభ్యర్థులు పట్టుబట్టాలని కోరారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- Nara Chandrababunaidu
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశంపార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

