Tue Mar 24 2026 18:15:01 GMT+0530 (India Standard Time)
ఆ వార్తలను నమ్మొద్దు....!!

వదంతులను నమ్మవద్దని, ఇంకా జాబితా తుదిరూపు దిద్దుకోలేదని తెలంగాణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వదంతలను నమ్మి పార్టీ కార్యాలయాల వద్ద ఎలాంటి హడావిడి చేయవద్దని ఆయన కోరారు. అధికార ప్రకటన ఇంకా వెలువడ లేదని, రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఉత్తమ్ తెలిపారు. ఎవరూ అసహనానికి లోనై ఆందోళనకు దిగవద్దని ఆయన కోరారు. మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు.
Next Story

