Thu Mar 19 2026 18:22:25 GMT+0530 (India Standard Time)
వార్ రూమ్ కు ఉత్తమ్...!

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అత్యవసరంగా బయలుదేరి రావాలని పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వార్ రూమ్ లో కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ తో సమావేశం కానున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న తరుణంలో కీలక నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవడంపై అధిష్టానం ఆరాతీయనుంది. తాజాగా దానం నాగేందర్ పార్టీని వీడటంతో దీనిపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి ఉత్తమ్ కు పిలుపు వచ్చింది. ఇటీవలే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. వీటితో పాటు పదవుల పంపకంపై కూడా ఉత్తమ్ తో చర్చించే అవకాశముంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లి కొందరు సీనియర్లు ఉత్తమ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేసి వచ్చని సంగతి తెలిసిందే. దీంతో ఉత్తమ్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠగా మారింది.
Next Story

