తెలంగాణ కంటే ఏపీ చాలా బెటర్
తెలంగాణలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చీఫ్ సెక్రటరీతో అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో [more]
తెలంగాణలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చీఫ్ సెక్రటరీతో అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో [more]

తెలంగాణలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చీఫ్ సెక్రటరీతో అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 19 వేల టెస్టులు జరిగితే, పెద్దదయిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 80 వేల టెస్టులు జరిగాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కూడా ఎక్కువ టెస్ట్ లు చేస్తున్నారని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం టెస్ట్ లు సక్రమంగా జరగడం లేదన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల చనిపోయిన వారికి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను వెనక్కు రప్పించాలని కోరారు. చీఫ్ సెక్రటరీతో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎల్ రమణ, చాడా వెంకటరెడ్డి, కోదండరామ్ తదితరులు కలసి కరోనా కారణంగా తలెత్తిన సమస్యలను ప్రస్తావించారు.

