అర్బన్ మావోయిజం పెరుగుతుందట.. ఎన్ఐఏ సోదాల్లో
తెలంగాణలో అర్బన్ మావోయిజం మళ్ళీ పెరుగుతోంది. అర్బన్ నక్సలైట్ల పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ బట్టబయలు చేసింది. వైజాగ్ లో దొరికిన ఒక జర్నలిస్టు [more]
తెలంగాణలో అర్బన్ మావోయిజం మళ్ళీ పెరుగుతోంది. అర్బన్ నక్సలైట్ల పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ బట్టబయలు చేసింది. వైజాగ్ లో దొరికిన ఒక జర్నలిస్టు [more]

తెలంగాణలో అర్బన్ మావోయిజం మళ్ళీ పెరుగుతోంది. అర్బన్ నక్సలైట్ల పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ బట్టబయలు చేసింది. వైజాగ్ లో దొరికిన ఒక జర్నలిస్టు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 63 మంది పైన కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 18 మంది ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి . ఇంట్లో పౌర హక్కుల నేత లతో పాటుగా అడ్వకేట్లు జర్నలిస్టు మహిళా సంఘాల ప్రతినిధులు పౌర సంఘాల ప్రతినిధుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు . దాదాపు 10 గంటల నుంచి జరుగుతున్న ఈ సోదాలు చాలా కీలకమైన డాక్యుమెంట్లతోపాటు పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు నుంచి సమాచారం. జర్నలిస్టు ముసుగులో మావోయిస్టు కు సహకారం అందిస్తారని అందిస్తున్నార ని ఆరోపణల మేరకు ఈ సోదాలు చేస్తున్నారు. వైజాగ్ లో నాగన్న అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఒక పత్రికకు జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు . నాగన్న దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పోలీసులు ప్రజాప్రతినిధుల కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చెరవేసినట్లుగా ఆధారాలు లభ్యమైనాయి. అయితే చాలా మంది జర్నలిస్టులు మావోయిస్టు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దశలోనే 63 మంది పైన జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఇందులో ఇవ్వాళ 17 మంది పైన అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, కర్నూలు, విజయవాడ విశాఖపట్నం, గుంటూరు, పొద్దుటూరు, కడప, అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

