Mon Feb 02 2026 07:53:54 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్డీఏలో ముసలం బయలుదేరిందా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీఏలో లుకలుకలు పెరిగిపోతున్నాయి. తాజాగా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) నేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2020 ఎన్నికలకు కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, ఇక ఆ అవకాశాన్ని వేరే వారికి ఇవ్వాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో జేడీయూతో బీజేపీ పొత్తు ఉంటుందనుకుంటున్న సమయంలో కుశ్వాహ చేసిన వ్యాఖ్యలు ఎన్డీఏ లో హాట్ టాపిక్ గా మారాయి.
Next Story

