Sat Dec 06 2025 00:36:10 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా సంచలన ప్రకటన
చేెవెళ్ల సభలో కేంద్ర హోంమత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు

చేెవెళ్ల సభలో కేంద్ర హోంమత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెలిపారు. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్న అమిత్ షా ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాలని అమిత్ షా ఆకాంక్షించారు. ఒక్కసారి తమకు అవకాశమిచ్చి చూస్తూ అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
మళ్లీ మోదీయే...
రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమేనని అని అమిత్ షా అన్నారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో అవినీి పాలన జరుగుతుందన్నారు. 2024లో తిరిగి ప్రధానిగా మోదీయే అవుతారని ఆయన చెప్పారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ విమర్శిస్తూనే అమిత్ షా ప్రసంగం కొనసాగింది. కుటుంబ పాలనను తరిమికొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.
అవినీతి కుటుంబం...
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కేసీఆర్ పెదవి విప్పలేదని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. చేవెళ్ల సభలో ఎన్నికల అజెండాను అమిత్ షా ప్రకటించారు. అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబం ఇరుక్కుందని విమర్శించారు. ప్రజలు తమకు ఒకసారి అవకాశమివ్వాలని కోరారు. బీజేపీని ఆశీర్వదిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు.
Next Story

