Sun Mar 15 2026 13:20:44 GMT+0530 (India Standard Time)
రాజధానులపై ఉండవల్లి రెస్పాన్స్ ఇదే
తొలిసారి మూడు రాజధానుల అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగమా? [more]
తొలిసారి మూడు రాజధానుల అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగమా? [more]

తొలిసారి మూడు రాజధానుల అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగమా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. అయితే దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని ఉండవల్లి తెలిపారు. అయితే అమరావతిలో రైతులు త్యాగం చేయలేదని, అక్కడ పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని తాను గతంలోనే చెప్పానన్నారు. జగన్ రాజధానుల విషయం కంటే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. లక్ష కోట్లు తినేశాడని టీడీపీ గత ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలు జగన్ కే పట్టంకట్టారన్నారు.
Next Story