Tue Feb 03 2026 12:57:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కరీంనగర్ మరో రెండు కరోనా కేసులు
కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో తిరిగిన వ్యక్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే [more]
కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో తిరిగిన వ్యక్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే [more]

కరీంనగర్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో తిరిగిన వ్యక్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాధితుడు తల్లి, సోదరికి కరోనా సోకినట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ సోకడంతో వారితో సన్నిహితంగా ఉన్న వారికి పరీక్షలు జరపాలని నిర్ణయించారు. మొత్తం ఆ కుటుంబంలో ఏడుగురు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. కుటుంబ సభ్యులందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
Next Story