Thu Mar 19 2026 13:52:13 GMT+0530 (India Standard Time)
చిన్నారిని రక్షించబొయి చనిపొయిన బాలిక

సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. భవనంపై ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారి శ్రేయ ప్రమాదవశాత్తూ కింద పడబోయింది. ఇది గమనించిన పల్లవి అనే పదేళ్ల బాలిక చిన్నారిని రక్షించేందుకు టీషర్టును పట్టుకుని చిన్నారిని పైకి లాగే ప్రయత్నం చేసింది. కానీ, ఆ బాలిక ప్రయత్నం ఫలించలేదు. బరువును ఆపలేకపోయిన బాలిక అదపు తప్పి చిన్నారితో పాటు తానూ కిందపడిపోయింది. ఈ ఘటనలో శ్రేయ వెంటనే మృతిచెందగా, పల్లవిని సమీపంలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఇద్దరు చిన్నారుల మరణంతో చిలకలగూడ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు గుండలవిసేలా రోదిస్తున్నారు.
Next Story

