Sat Mar 28 2026 13:59:32 GMT+0530 (India Standard Time)
తుమ్మలదీ అదే మాట....!!

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆయన ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు తిరస్కరిస్తే తాను వ్యవసాయం చేసుకుంటానన్నారు. టీడీపీని వీడేటప్పుడు తాను బాధపడ్డానని, కానీ ఇక్కడ పార్టీలతోనే రాజకీయాలు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల పార్టీలు ఇక్కడ రాజకీయాలు చేస్తే అభివృద్ధి జరగదన్నారు. ఇక్కడ తెలుగుదేశానికి మనుగడ ఉండదన్నారు. ఇక్కడ ఉండే పార్టీలతోనే రాజకీయాలు చేయాలి తప్ప, ఇతర రాష్ట్రాలపార్టీలతో రాజకీయాలు చేస్తే చిప్పే గతన్నారు. కేసీఆర్ బలవంతంగా ఆదేశిస్తేనే తాను పోటీకి దిగానన్నారు. మంత్రి తుమ్మల కూడా కేసీఆర్ తరహాలోనే ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటానని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది
Next Story

