Tue Mar 17 2026 03:45:19 GMT+0530 (India Standard Time)
ఆ ఘనత జగన్ కే దక్కుతుంది..!

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజశేఖర్ రెడ్డిని నీటిదొంగ అన్న టీఆర్ఎస్ కు జగన్ ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేయమని చెప్పినందుకు ఏకంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ నే పార్టీ నుంచి బహిష్కరించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఓ వైపు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అంటూనే మరోవైపు ప్రత్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ ను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.
Next Story

