Mon Mar 23 2026 10:29:01 GMT+0530 (India Standard Time)
మళ్లీ ఎమ్మెల్యేలు రిసార్ట్స్ కు....?

మళ్లీ తమిళనాట రిసార్ట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో టీటీవీ దినకరన్ తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించారు. తీర్పు ఎలా వచ్చినా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద తమిళనాట మరోసారి రిసార్ట్స్ రాజకీయాలకు దినకరన్ తెరలేపారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాలో దినకరన్ ఉన్నారు. తీర్పు అనుకూలంగా వస్తే పళనిస్వామి ప్రభుత్వంపై డీఎంకేతో కలసి అవిశ్వాసం పెడతామని దినకరన్ గతంలోనే ప్రకటించారు.
Next Story

