Thu Jan 29 2026 13:50:26 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు భక్తులు రావద్దు.. ఛైర్మన్ సూచన
తిరుమల దర్శనం భక్తులు వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమల దర్శనం భక్తులు వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్ లను మూసివేశామని చెప్పారు. ఘాట్ రోడ్ల పునరుద్ధరణకు మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొండచరియలు విరిగినప్పుడు వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు.
మూడు రోజుల సమయం...
తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించేందుకు ఐఐఐటీ నిపుణులు వస్తున్నారని, వారు పరిశీలించిన తర్వాతనే రోడ్ల మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాలుగు మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. రాకపోకలను పునరుద్ధరించేందుకు మూడు రోజుల సమయం పట్టవచ్చని ఆయన చెప్పారు.
Next Story

