Mon Feb 02 2026 10:43:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కోసం ఢిల్లీలో టవర్ ఎక్కిన తెలంగాణ యువకుడు

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరంగల్ వాసి ఉమేష్ రెడ్డి ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఆయన ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో ఓ సెల్ టవర్ ఎక్కారు. ‘సేవ్ ఏపీ’ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రధాని కార్యాలయానికి ఆయన నేరుగా ఫోన్ చేసి ఏపీకి న్యాయం చేయకపోతే దూకేస్తానని స్పష్టం చేశారు. దీంతో పీఎంఓ కార్యలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉమేష్ రెడ్డిని కిందకు దించేందుకు అధికారులు చర్చలు జరిపి ప్రయత్నించారు. అయినా, వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆయనను బలవంతంగా కిందకు దించారు. ప్రస్తుతం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు తాను ఉద్యమిస్తానని ఆయన పేర్కొన్నారు.
Next Story

