Mon Mar 23 2026 18:35:26 GMT+0530 (India Standard Time)
జగన్ ను పరామర్శించిన మంత్రి... చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

హత్యాయత్నానికి గురై చికిత్స పొందుతున్న ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్వించారు. జగన్ ఆరోగ్య వివరాలు ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి షాకయ్యానని పేర్కొన్నారు. తాను 30 ఏళ్లు టీడీపీలో ఉన్నానని... చంద్రబాబు డ్రామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని అన్నారు. నాలుగు నెలలుగా జరుగుతున్న డ్రామాలో భాగంగానే జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు మాట్లాడిన విధానం బాధ కలిగించిందన్నారు. సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పై దాడి ఏపీ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుందన్నారు.
Next Story

