Sun Feb 01 2026 10:03:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్..పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకి తెలంగాణ

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వలను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరనుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 61 శాతానికి చేరుతుంది. అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన సర్పంచ్ స్వప్ణారెడ్డితో పిటీషన్ వేయించి, బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం క్యాబెనెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని ఆయన ఆదేశించారు.
Next Story

