Fri Mar 20 2026 19:55:03 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ నేతకు ఊహించని షాక్

టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి అనేక వివాదాల నడుమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ప్రత్యర్థులు అంబుడ్స్ మన్ ను ఆశ్రియించగా, వివేక్ నియామకం చెల్లదని తీర్పు వచ్చింది. దీంతో వివేక్ కోర్టుకు వెళ్లగా వివేక్ కు అనుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీంతో ప్రత్యర్థులు ఈ తీర్పును సవాల్ చేయగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, అంబుడ్స్ మెన్ తీర్పును సమర్థించింది. వివేక్ ను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

