Wed Mar 18 2026 01:01:54 GMT+0530 (India Standard Time)
అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని ఒప్పుకున్న టీఆర్ఎస్ ఎంపీ

టీఆర్ఎస్ లో పలువురు అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని ఆ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. శుక్రవారం ఆయన ఓ ఛానల్ తో మాట్లాడుతూ... కొందరు అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా, తమ బాస్(కేసీఆర్) మార్చలేదని, అయితే, పార్టీపైన ఒక్కడా వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. లగడపాటి రాజగోపాల్ చెప్పినట్లుగా నారాయణపేట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న శివకుమార్ రెడ్డి కి కాంగ్రెస్ టిక్కెట్ దక్కలేదన్న సానుభూతి ఉందని, ఆయితే అక్కడ కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి గెలుస్తారని, శివకుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Next Story

