Fri Mar 20 2026 13:03:13 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ మనస్సులో మాట బయట పెట్టిన ఎమ్మెల్యే

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రేపు అసెంబ్లీని రద్దు చేస్తారనే ఊహాగానాలు ఉన్నా కేసీఆర్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఎక్కడా దీనిపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని ఎక్కడ బయటకు చెప్పడం లేదు. అయితే, కేసీఆర్ ఇంత వ్యూహాత్మకంగా అసెంబ్లీ రద్దు అంశాన్ని బయటకు చెప్పకుండా ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం బయటపెట్టేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బుధవారం పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే, ఒకేరోజు ఇన్ని శంకుస్థాపనలు చేయడానికి కారణమేంటని మీడియా అడగగా... రేపు ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టే ఇవాళ ఎక్కువ శంకుస్థాపనలు చేసినట్లు ప్రకటించారు. 100 శాతం ఇది పక్కా అని ఆయన తేల్చేశారు.
Next Story

