Wed Mar 25 2026 01:44:34 GMT+0530 (India Standard Time)
తెలంగాణ భవన్ కూ తాకిన టిక్కెట్ల సెగ

ఇంతవరకు కాంగ్రెస్, టీడీపీ కార్యాలయాలకే తాకిన టిక్కెట్ల సెగ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు కూడా తాకింది. ఖైరతాబాద్ అసెంబ్లీ టిక్కెట్ ను నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న మన్నె గోవర్ధన్ రెడ్డికే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టిక్కెట్ ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ కు ఖరారు అయినట్లు వస్తున్న వార్తలపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాయిస్తానన్న ఉద్యోమ ద్రోహి దానం నాగేందర్ కు టిక్కెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు అనుకూలంగా... దానం నాగేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Next Story

