Mon Mar 16 2026 18:48:47 GMT+0530 (India Standard Time)
లగడపాటి ఇంటివద్ద టీఆర్ఎస్ శ్రేణుల హంగామా

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటివద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా చేశారు. లగడపాటి అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లోని లగడపాటి ఇంటివద్ద రంగులు చల్లుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్ని జాతీయ సంస్థలు తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా లగడపాటి మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. పోలింగ్ కు ముందు కూడా ఆయన ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన అంచనాలను టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
Next Story

