Mon Dec 08 2025 21:50:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆపద్ధర్మ మంత్రుల ఓటమి

ఆపద్ధర్మ మంత్రి, పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. జిల్లాలోనే బలమైన నేతగా ఉన్న తుమ్మల ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. గత ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ను ఓడించి భారీ మెజారిటీతో గెలిచిన తుమ్మల ఇప్పుడు ఉపేందర్ రెడ్డి పై ఓటమి పాలయ్యారు. ఇక కొల్లాపూర్ లో మరో ఆపద్ధర్మ మంత్రి, కీలక నేత జూపల్లి కృష్ణరావు కూడా ఓటమిపాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. తమ పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేసి తనను ఓడించాలని కృష్ణారావు వాపోయారు.
Next Story

