Mon Feb 02 2026 03:43:54 GMT+0000 (Coordinated Universal Time)
‘టామీ’ కూడా వారి వద్దకే వెళ్లిపోయింది

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన 11 మంది సభ్యుల కుటుంబం మొత్తం మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఇష్టంగా పెంచుకున్న టామీ అనే కుక్క కూడా తన యాజమానుల వద్దకే వెళ్లిపోయింది. 11 మంది ఆత్మహత్య చేసుకున్న రోజు టామీ భవనంపైన జ్వరంతో వణుకుతూ ఉండటాన్ని పోలీసులు గమనించారు. విచారణలో ఇది కీలకంగా మారింది. ఈ సమయంలో జంతుహక్కుల కార్యకర్తలు కుక్కను తమ సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడికే పోలీసులు వెళ్లి దాని సైగల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే, తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం లేకపోవడం, కొత్త వాతావరణానికి రావడంతో ఆది బాగా కోపంగా ఉండేదట. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం అది మరణించింది.
Next Story

