Mon Mar 23 2026 00:55:48 GMT+0530 (India Standard Time)
సినీ పరిశ్రమ కదిలిరావాలని..

ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తెలుగు సినీ పరిశ్రమ కదిలిరావాలని కోరుతూ విజయవాడలో సినీ నిర్మాత యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో జలదీక్షకు దిగారు. శనివారం ఉదయం కృష్ణా నది పున్నమి ఘాట్ లో నదిలో దీక్షకు దిగారు. ఆయన దీక్షకు పలువురు విద్యార్థులు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, ఈ సమయంలో హోదా కోసం పోరాడేందుకు సినీ పరిశ్రమ ముందుకురావాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పక్క రాష్ట్రాల సినీ నటులు వారి రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ముందుంటున్నారని, కనీసం వారిని చూసైనా మన నటులు ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు కదిలిరావాలని కోరారు.
Next Story

