Thu Mar 19 2026 04:09:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: తిరుమలపై హైకోర్టులో పిల్

తిరుమలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానములను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకు రావాలంటూ కొందరు న్యాయపోరాటం ప్రారంభించారు. టిటిడి ఆదాయ వ్యయాలు, ఆభరణాల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తిరుమలలో నేలమాలిగలు, గుప్త నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని గుంటూరుకు చెందిన అనీల్, గుజరాత్ కు చెందిన భూపేంద్ర గోస్వామి హైకోర్టును ఆశ్రయించారు. టిటిడి పురాతన కట్టడాలపై మే 4 న కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖను పునరుద్ధరించాలని వ్యాజ్యంలో పిటిషనర్లు పేర్కొన్నారు.
Next Story

