Thu Mar 19 2026 04:09:25 GMT+0530 (India Standard Time)
తిరుమలలో అపచారం

తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. ఇక్కడి జీన్సీ టోల్ గేట్ వద్ద, ఏకంగా గరుడ పోలీస్ రెస్ట్ హౌజ్ ముందే రోడ్డుపై మాంసం పడి ఉండటం భక్తులను విస్మయానికి గురిచేసింది. ఓ చినిగిపోయిన నల్ల కవరు నుంచి మాంసం బయట పడి ఉంది. తిరుమలలో మందు, మాంసం, పొగాకు ఉత్పత్తులు వంటివి నిషేధం. తిరుమలకు వెళ్లేముందే అలిపిరి వద్ద పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే తిరుమలకు పంపిస్తారు. అయితే, పోలీసుల కళ్లు కప్పిపైకి మాంసం ఎవరు తీసుకెళ్లారని విచారిస్తున్నారు.
Next Story

