టిమ్స్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలేవీ?
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిలో ఆసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. సరైన వసతులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఇక్కడ [more]
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిలో ఆసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. సరైన వసతులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఇక్కడ [more]

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిలో ఆసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. సరైన వసతులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఇక్కడ వసతులు లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సరైన తిండి పెట్టడం లేదంటూ రెండు రోజుల క్రితం రోగులు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు . దీంతో అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ని తీసివేసి కొత్త కాంట్రాక్టర్ ని ఈరోజు నుంచి తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ సరైన వైద్య పరికరాలు లేకపోవడం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కరోనా రోగుల పరీక్షించేందుకు తప్పనిసరి గా సీటీ స్కాన్ అవసరం.. కానీ ఇక్కడ సిటీ స్కాన్ లేకపోవడం తో రోగులను బయటి ప్రాంతాలో పరీక్షలకోసం పంపిస్తున్నారు. సీటీ స్కాన్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి గతంలోనే రాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సిటీ స్కాన్ లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన టీమ్స్ ఆస్పత్రిలో కనీస వసతులు రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

