ముగ్గురూ రాలేదే? ఎందుకలా?
భారతీయ జనతా పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాలేదు. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ [more]
భారతీయ జనతా పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాలేదు. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ [more]

భారతీయ జనతా పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాలేదు. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ పై అవగాహన, రాజధాని అమరావతి తరలింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల కడప జిల్లాలో జరిగిన బీజేపీ సమావేశానికి కూడా సీఎం రమేష్ హాజరు కాలేదు. ముగ్గురూ టీడీపీ నుంచి వచ్చిన వారు కావడం, బీజేపీ నేతలు రాజధాని పై చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో వీరు సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు తదితరులు హాజరయ్యారు.