Thu Mar 19 2026 13:52:15 GMT+0530 (India Standard Time)
మూడోది మనదే..!

ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంతో కొనసాగుతోంది. మొదటి రెండు మ్యాచ్ లు కోల్పోయిన భారత్ సమష్టిగా ఆడి మూడో మ్యాచ్ ను సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ 97, 103తో రెండు ఇన్నింగ్స్ లోనూ రాణించడంతో పాటు ఫేసర్లు ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్ చేతులెత్తేసింది. వాస్తవానికి నిన్ననే భారత్ విజయానికి చేరువ కాగా ఇంగ్లండ్ ఆటగాడు ఆదిల్ రషీద్(33 నాటౌట్) అవుట్ కాకుండా చివరి వరకు ఆడటంతో ఇవాళ కూడా ఆడాల్సి వచ్చిది. బుధవారం మ్యాచ్ ప్రారంభమైన 17 బంతుల్లోనే భారత్ ఇంగ్లండ్ ను ఆలౌట్ చేసి మ్యాచ్ ను సొంతం చేసుకుంది.
Next Story

