Thu Mar 19 2026 04:45:07 GMT+0530 (India Standard Time)
విషాదం.. ఆరుగురు సజీవదహనం
మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. నిద్రలో ఉన్న వారు నిదర్లోనే ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ లో ఈ ఘటన జరిగిది.
అకస్మాత్తుగా మంటలు....
ప్రమాదవశాత్తూ ఇంట్లో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక,ఆమె ఇద్దరు కుమార్తెలు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అప్పటికే ఇంట్లోని ఆరుగురు సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

