Sat Dec 06 2025 04:07:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నటుడు కైకాల సత్యనారాయణ మృతి
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందారు

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందారు. గత కొంత కాలంగా సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఫిల్మ్‌నగర్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విలన్ గా తెలుగు ప్రేక్షకులకు కైకాల సత్యనారాయణ సుపరిచితం. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సీనియర్ నటులతో నటించిన కైకైల సత్యనారాయణ 777 వందల సినిమాల్లో నటించారు. 1935 జులై 25న కైకాల జన్మించారు. ఆయన కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు.
విలన్ గా తెలుగు...
పౌరాణిక, జానపద, సాంఘింక చిత్రాల్లో ఆయన విలన్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన హావభావాలు, డైలాగులతో తెలుగు ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలపాటు అలరించారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడున్నారు. పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది ఇంటికి వచ్చారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి వచ్చారు. సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
Next Story

