Thu Jan 29 2026 08:28:35 GMT+0000 (Coordinated Universal Time)
ట్యాక్స్ మినహాయింపులో షాక్ ఇచ్చిన నిర్మలమ్మ
ఆదాయపు పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పులు లేవు. వ్యక్తిగత పన్ను శ్లాబ్ లో ఎలాంటి మార్పులు లేవు

ఆదాయపు పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పులు లేవు. వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లారు. వ్యక్తిగత పన్ను శ్లాబ్ లో ఎలాంటి మార్పులు లేవు. పన్నులకు సంబంధించి అనుబంధ సెక్షన్ల లోనూ ఎలాంటి మార్పులు లేకుండానే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని, కరోనా సమయంలో కొంత వెసులు బాటు కల్పిస్తారని ఊహించిన వారికి నిర్మలమ్మ షాకిచ్చారు.
రిటర్న్ దాఖలుకు.....
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఐటీ రిటర్న్ ల దాఖలులో మరో వెసులుబాటు కల్పించారు. ఆదాయపు పన్ను చెల్లింపు సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశమిచ్చారు. ఐటీ రిటర్న్ లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకునే వీలు కల్పించారు.
Next Story

