Thu Mar 19 2026 11:34:24 GMT+0530 (India Standard Time)
త్వరలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్…?
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలో ఉప ఎన్నికలు జరగాల్సిన స్థానాల్లో పరిస్థితిని అంచనా [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలో ఉప ఎన్నికలు జరగాల్సిన స్థానాల్లో పరిస్థితిని అంచనా [more]

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలో ఉప ఎన్నికలు జరగాల్సిన స్థానాల్లో పరిస్థితిని అంచనా వేసిందంటున్నారు. దాదాపు 105కు పైగానే శాసనసభ స్థానాలకు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వీలయినంత త్వరగా ఉప ఎన్నికను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. దీంతో ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజారాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లోనే విడుదలయ్యే అవకాశముంది.
Next Story