Sun Mar 15 2026 15:23:18 GMT+0530 (India Standard Time)
రాజధాని తరలింపుపై నేడు హైకోర్టులో
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు అమరావతి రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నెల 28వ తేదీన పరిపాలన రాజధానిని [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు అమరావతి రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నెల 28వ తేదీన పరిపాలన రాజధానిని [more]

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు అమరావతి రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నెల 28వ తేదీన పరిపాలన రాజధానిని విశాఖను తరలిస్తున్నారంటూ పిటీషన్ వేశారు. దీనికి ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. మూడు రాజధానుల అంశం చట్ట సభల్లో పెండింగ్ లో ఉందని, బిల్లులు ఇంకా ఆమోదం పొందలేదని పేర్కొంది. బిల్లులు ఆమోదం పొందేంత వరకూ రాజధాని తరలింపు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టదని ప్రభుత్వం కౌంటర్ పిటీషన్ వేసింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story