Sun Mar 22 2026 14:14:31 GMT+0530 (India Standard Time)
టీజీ, జగన్ భేటీ…. టీజీ ప్రశ్నకు జగన్ జవాబు ఇదే
కర్నూలులో వివాహానికి హాజరైన జగన్ ను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కలిశారు. కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ కర్నూలు హైకోర్టు ఎంతవరకూ వచ్చిందని [more]
కర్నూలులో వివాహానికి హాజరైన జగన్ ను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కలిశారు. కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ కర్నూలు హైకోర్టు ఎంతవరకూ వచ్చిందని [more]

కర్నూలులో వివాహానికి హాజరైన జగన్ ను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కలిశారు. కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ కర్నూలు హైకోర్టు ఎంతవరకూ వచ్చిందని జగన్ ను ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రానికి పంపామని జగన్ బదులిచ్చారు. అందుకు టీజీ వెంకటేష్ త్వరలోనే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కర్నూలుకు హైకోర్టును ఇవ్వడం పట్ల జగన్ కు ఈ సందర్భంగా టీజీ వెంకటేష కృతజ్ఞతలు తెలిపారు. తాను జగన్ తో భేటీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని ఆ తర్వాత టీజీ వెంకటేష్ మీడియాకు తెలిపారు.
Next Story