Thu Mar 19 2026 21:31:03 GMT+0530 (India Standard Time)
టీజీకి మతిస్థిమితంలేదు

టీజీ వెంకటేశ్ పై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మండిపడ్డారు. నిన్న టీజీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వకుంటే కర్ణాటకలో లాగా సీమాంధ్రులు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడిస్తారని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన కేశవరావు టీజీకి మతిస్థిమితం లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో బీరాలుపలికిన టీజీ వెంకటేశ్, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత తమ కాళ్లపై పడ్డారని కేశవరావు చెప్పారు. పిచ్చోడి మాటాలను పట్టించుకోబోమని కేశవరావు తెలిపారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
Next Story

