Mon Mar 16 2026 05:05:38 GMT+0530 (India Standard Time)
స్క్రోలింగ్ చూసి స్పందన ఏంది పవన్…?
స్క్రోలింగులు చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదని, తానేం మాట్లాడానో తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే బాగుంటుందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. తనపై [more]
స్క్రోలింగులు చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదని, తానేం మాట్లాడానో తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే బాగుంటుందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. తనపై [more]

స్క్రోలింగులు చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదని, తానేం మాట్లాడానో తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే బాగుంటుందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ స్పందించారు. పొత్తులపై అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, మార్చిలో క్లారిటీ వస్తుందనే తాను మాట్లాడానని, అందులో తప్పేమీ లేదన్నారు. పొత్తులపై ఫైనల్ నిర్ణయం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కలిసే అవకాశం ఉందని టీజీ వ్యాఖ్యానించడం… దానికి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడటం తెలిసిందే.
Next Story