Tue Mar 17 2026 15:59:09 GMT+0530 (India Standard Time)
టీడీపీని వీడతానని ఎవరు చెప్పారు?
తాను టీడీపీలోనే కొనసాగుతానని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి టీజీ భరత్ తెలిపారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీజీ భరత్ ఖండించారు. తాను, [more]
తాను టీడీపీలోనే కొనసాగుతానని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి టీజీ భరత్ తెలిపారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీజీ భరత్ ఖండించారు. తాను, [more]

తాను టీడీపీలోనే కొనసాగుతానని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి టీజీ భరత్ తెలిపారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీజీ భరత్ ఖండించారు. తాను, తన తండ్రి వేర్వేరు పార్టీలో ఉండటాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీజీ భరత్ ప్రస్తావించారు. ఏపీలో జగన్, తెలంగాణలో జగన్ సోదరి షర్మిల వేర్వేరు పార్టీలు పెట్టలేదా? అని టీజీ భరత్ ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు.
Next Story