Thu Dec 18 2025 23:04:26 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం : 39 మంది మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించారు. ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
లోయలో పడటంతో...
కొండ మీద నుంచి పడి పోవడంతో 39 మంది మరణించారని అధికారులు తెలిపారు. అత్యంత విషాదకరమైన ఈఘటనలో వలసదారులు మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. కొలంబియా నుంచి డేరియన్ లైన్ దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఒక శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

