Thu Mar 19 2026 15:28:54 GMT+0530 (India Standard Time)
అమరావతిలో రూ.140 కోట్లతో భారీ ఆలయం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 25 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయానికి సంబంధించిన డిజైన్లను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరపాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తం 25 ఎకరాల్లో సుమారు రూ.140 కోట్లతో ఆలయ నిర్మాణం జరపనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుమల తిరుపతి దేశస్థానం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Next Story

