Fri Mar 21 2025 07:11:17 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : పది గంటలు దాటితే బయటకు రావద్దు.. వైద్యుల హెచ్చరిక
ఎండలు ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి

ఎండలు ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండలు అదిరిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు.
మరింత ఎక్కువగా...
ఈ ఏడాది వేసవిలో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అంతే స్థాయిలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని...
ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగుతులుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రైషన్ కు లోను కాకుండా మంచినీటిని ఎప్పటికప్పుడు ఎక్కువగా తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి వాటితో వడ దెబ్బకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఈ ఎండలకు తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు వంటి లక్షణాలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని కూడా వైద్యులు తెలిపారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story