Thu Mar 19 2026 18:01:40 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి [more]
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి [more]

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నామా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు. ఆయనను ఖమ్మం పార్లమెంటుకు టీఆర్ఎస్ తరపున బరిలో నిలబెట్టే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించేశారు.
Next Story