Mon Feb 02 2026 13:14:29 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి.... చివరి నిమిషంలో.....?

కడప జిల్లాటీడీపీలో కలకలం రేగింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. మేడా కూడా వైసీపీ నేతలతో చర్చలు జరిపారని గుర్తించిన టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తన సోదరుడి బలవంతం మేరకు వైసీపీ నేతలతో చర్చలు జరిపానని మేడా మల్లి కార్జునరెడ్డి అంగీకరించారు. మేడా అసంతృప్తికి గల కారణాలను టీడీపీ పెద్దలు అడిగి తెలుసుకున్నారు. మేడా మల్లికార్జునరెడ్డి ఈరోజు సచివాలయానికి వచ్చి పార్టీ పెద్దలను కలిశారు. పార్టీ పెద్దల జోక్యంతో వైసీపీలో చేరే ఆలోచనను మేడా విరమించుకున్నారని తెలుస్తోంది.సీఎంను కలిసేందుకు ఆయన కొద్దిసేపటి క్రితం సచివాలయానికి వచ్చారు. కడప జిల్లాలో గత ఎన్నికల్లో రాజంపేట స్థానం మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది.
Next Story
