Mon Mar 16 2026 05:42:10 GMT+0530 (India Standard Time)
టీడీపీకి ఎల్ రమణ రాజీనామా
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని ఎల్ [more]
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని ఎల్ [more]

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని ఎల్ రమణ లేఖలో పేర్కొన్నారు. తనకు సుదీర్ఘకాలం పార్టీలో అవకాశం కల్పించిన చంద్రబాబుకు ఎల్. రమణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, అనుచరలు సూచనల మేరకు తాను టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎల్ రమణ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఎల్ రమణ పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువవ్వాలనే టీఆర్ఎస్ లో చేరుతున్నానని తెలిపారు. ఎల్లుండి రమణ టీఆర్ఎస్ లో చేరుతున్నారు.
Next Story