Sun Mar 16 2025 05:57:10 GMT+0000 (Coordinated Universal Time)
రేపు గవర్నర్ వద్దకు టీడీపీ
రేపు తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ బృందం గవర్నర్ ను కలవనుంది. చంద్రబాబు [more]
రేపు తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ బృందం గవర్నర్ ను కలవనుంది. చంద్రబాబు [more]

రేపు తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ బృందం గవర్నర్ ను కలవనుంది. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా దాడి ఘటన, తదనంతర పరిణామాలపై గవర్నర్ కు టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. డీజీపీ చేసిన వ్యాఖ్యలను కూడా గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకురానున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఇప్పటికే టీడీపీ ఆక్షేపిస్తుంది. దీనిపై చర్యలను తీసుకోవాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నారు. ప్రతిపక్ష నేత పర్యటన పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరిని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.
Next Story