కొంత టైమ్ ఇవ్వండి
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరిపారు. అర్థరాత్రి వరకూ వల్లభనేని వంశీతో ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరిపారు. అర్థరాత్రి వరకూ వల్లభనేని వంశీతో ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ [more]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరిపారు. అర్థరాత్రి వరకూ వల్లభనేని వంశీతో ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడారు. దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఇటీవల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గన్నవరం సమీక్ష సమావేశానికి కూడా వల్లభనేని వంశీ గైర్హాజరయ్యారు. వల్లభనేని వంశీని పార్టీలోనే కొనసాగాలని వారు కోరారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులపై పార్టీ అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీల సంగతిని కూడా వల్లభనేని వంశీకి వివరించారు. అయితే తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని వల్లభనేని వంశీ కోరినట్లు తెలిసింది.